రెండు రాష్ట్రాలు దర్యాప్తు జరిపించాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై దాడికి రెక్కీ జరిగిందని వస్తున్న వార్తలపై అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు జరిపించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెక్కీ జరగడం ముమ్మాటీ తప్పేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయకపోతే కేంద్రానికి చెప్పాలన్నారు. అప్పుడు కేంద్రమే దర్యాప్తు జరిపిస్తుందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.













