అనూహ్య పరిణామం… కాంగ్రెస్ సీనియర్ నేత రాజీనామా
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత పదవికి కమల్‌నాథ్ హఠాత్తుగా రాజీనామా చేసేశారు. అయితే ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపించారు. హైకమాండ్ ఈ రాజీనామాను ఆమోదించింది. ఇక కమల్‌నాథ్ స్థానంలో డాక్టర్ గోవింద్ సింగ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఇకపై మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేతగా గోవింద్ సింగ్ కొనసాగనున్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏప్రిల్ 28న కమల్‌నాథ్‌కు రాసిన లేఖలో కాంగ్రెస్ అధిష్ఠానం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రతి పక్షనాయకుడి పదవికి మీరు చేసిన రాజీనామా తక్షణమే ఆమోదించింది. సీఎల్పీ నాయకుడిగా మీరందించిన సహాయ సహకారాన్ని పార్టీ ధన్యవాదాలు తెలుపుతోందని అన్నారు.













