సుప్రీంకోర్టు తదుపరి సీజేఐ ఆయనే!
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐ పదవిలో కొనసాగినట్లవుతుంది. ప్రక్రియలో భాగంగా తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని కేంద్ర ప్రభుత్వం యుయు లలిత్ను కోరింది. దీంతో ఆయన తన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే న్యాయమూర్తి పేరును కేంద్రానికి సిఫారసు చేయనున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత సీనియర్ న్యాయమూర్తిని వారసుడిగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో యుయు లలిత్ తర్వాత డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ చంద్రచూడ్ పేరును సీజే లలిత్ ప్రతిపాదించే అవకాశాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జస్టిస్ చంద్రచూడ్ చాలా రోజులు సీజేఐ పదవలో ఉండే ఛాన్సు ఉంది. ఒకవేళ చంద్రచూడ్ సీజేఐగా నియామకం చెందితే అప్పుడు ఆయన 2024, నవంబర్ 10వ తేదీన రిటైర్ అవుతారు. అంటే రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు.













