జేఎన్యూ కీలక నిర్ణయం …ఇకపై యూనివర్సిటీలో
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూనివర్సిటీలో అనధికార కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షను అమలు చేయనుంది. వర్సిటీ ప్రాంగణంలో ధర్నాలు చేసే విద్యార్థులపై రూ.20 వేల నుంచి రూ.30 వేల జరిమానా విధించనుంది. అదేవిధంగా హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు చేయాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు 10 పేజీల విద్యార్థుల క్రమశిక్షణ ప్రవర్తన నియమావళి ని జేఎన్యూ విడుదల చేసింది. ఇందులో ధర్నాలు, ఫోర్జరీ వంటి వివిధ రకాల చర్యలకు శిక్షలు, విచారణ ప్రక్రియలను నిర్దేశించింది. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా నిబంధనలు విశ్వవిద్యాలయంలోని అందరికీ వర్తిసాయని నోటీసుల్లో పేర్కొంది.













