అందుకే అలాంటి మాటలు .. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ను పదవి నుంచి దింపేందుకు కుట్ర జరుగుతోందట. ఆయన ఆహారంలో విషపూరిత పదార్థాలు కలుపుతున్నారట. హిందుస్థాన్ అవామ్ మోర్చా చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంరీa ఈ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం నీతీశ్ కుమార్ అసెంబ్లీలో అసభ్య పదజాలం ఉపయోగించారు. ఆ మాటల వల్ల ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిన్న కూడా ఆయన నియంత్రణ కోల్పోయి నా గురించి అవమానకరంగా మాట్లాడారు. నేను ఆయన కంటే అనుభవంపరంగా, వయసులోనూ పెద్దవాడిని అనే విషయాన్ని మర్చిపోయారు. ఆయన మానసిక ఆరోగ్యం దిగజారిపోతుందనేదానికి ఇది గుర్తు. ఆయనకు ఇచ్చే ఆహారంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ ఆహారం వల్ల ఆయన తనపై తాను నియంత్రణ కోల్పోతున్నారని నాకు అనుమానం కలుగుతోంది. ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన్ను గద్దె దించేందుకు కుట్ర చేస్తున్నారు అని అన్నారు.













