గాలిలో ఎగిరే కారు..
జపాన్‌కు చెందిన స్కైడ్రైవ్ ఐఎన్సి కంపెనీ రహదారులపై డ్రైవింగ్ చేసినట్లుగా గాలిలో కూడా చుట్టి రావాలన్న దశాబ్దాల నాటి కల నెరవేరే అవకాశం త్వరలో ఉందని తెలిపింది. ఇందుకు సంబంధించి ఇటీవల మానవ సహిత ఫ్లయింగ్ కారు టెస్టు నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. జపాన్ రాజధాని టోక్కోలోని టయోటా టెస్టు ఫీల్డ్‌లో ఆగస్టు మొదటి వారంలో నిర్వహించిన ఈ టెస్టు డ్రైవ్‌కు చెందిన ఫోటోలను, వీడియోలను కంపెనీ మీడియాకు విడుదల చేసింది. ప్రొపెలర్లతో ఒక మోటర్ సైకిల్‌లాగా కనిపించే ఒక కాంట్రాప్షన్ భూమి నుంచి దాదాపు 1 నుంచి 2 మీటర్ల ఎత్తులో చుట్టూ ఒక కంచె ఉన్న ప్రదేశంలో నాలుగు నిమిషాలు తిరిగినట్లు ఆ వీడియోల్లో ఉంది. ఈ స్కైడ్రైవ్ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న టోమోహిరో పుకుజావా మాట్లాడుతూ 2023లోగా ఈ ఫ్లయింగ్ కారును రియల్ లైఫ్ ప్రోడక్టుగా మార్చగలమని తాము నమ్ముతున్నామని అన్నారు.













