రూ.30.5 కోట్లు గెలుచుకున్న భారతీయులు
యూఏఈలో 20 మంది కలిసి కొనుగోలు చేసిన ఓ లాటరీ టికెట్టును అదృష్టం వరించింది. బిగ్ టికెట్ అబుదాబి డ్రా లో వీరు మొదటి బహుమతి కింద 1.5 కోట్ల దిర్హంలు (రూ.30.5 కోట్లు) గెలుచుకున్నారు. ఈ బృందంలో 19 మంది భారతీయులు ఉండగా మరొకరు బంగ్లాదేశ్ వాసి అని ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. గత రెండేళ్ల నుంచి బిగ్ టికెట్‌ను కొనుగోలు చేస్తున్నాను. టికెట్ ధర ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా ఇద్దరు లేదా ముగ్గురం కలిసి కొనుగోలు చేస్తుంటాం. ఈ సారి మాత్రం 20 మందిమి కలిసి కొన్నాం అని నాఫెల్ మయాన్ కలాతిల్ పేర్కొన్నారు. వీరంతా కేరళకు చెందిన వారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న తమను లక్ష్మీ దేవి వరించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.













