చైనా విజ్ఞప్తిని తిరస్కరించిన భారత్
చైనా విజ్ఞప్తిని భారత్ తిరస్కరించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావాలని భావించారు. అయితే ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా వాంగ్ యీతో మోదీ భేటీ సాధ్యపడదని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రధాని మోదీతో భేటీ కావాలన్న చైనా విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించింది. పాకిస్థాన్ పర్యటన ముగించుకుని వాంగ్ యీ భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. మరుసటి రోజు ఆయన ప్రధాని మోదీతో భేటీ కావాలని భావించారు. అయితే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కావాల్సిన షెడ్యూల్ ముందుగానే ఖారారైంది. దీని కారణంగా చైనా విదేశాంగ మంత్రితో భేటీ సాధ్యం కాదని సున్నితంగా పేర్కొంది.













