కేంద్రం కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమానాలపై

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య మరోసారి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. దాంతో ఫిబ్రవరి 28 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో జనవరి 31 వరకు షెడ్యూల్డ్ విమాన సర్వీసుల్ని భారత్ రద్దు చేసింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని మరో నెల రోజుల పొడిగిస్తూ డీజీసీఏ ప్రకటన జారీ చేసింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో తాజాగా నిర్ణయం తీసుకున్నది. అయితే ఎయిర్ బబుల్ ఒప్పందాలు, అంతర్జాతీయ ఎయిర్ కార్గో విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని ఇంతకు ముందు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.











































































