సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. మహిళా మాజీ జడ్జీలతో
మణిపుర్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు సహాయ, పునరావాస పర్యవేక్షణకు ముగ్గురు హైకోర్టు మహిళా మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించింది. జమ్మూ కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ నేతృత్వంలోని ఈ కమిటీలో జస్టిస్ (రిటైర్డ్) షాలినీ పీ జోషి, జస్టిస్ ఆశా మేనన్లు ఉంటారని పేర్కొంది. రాష్ట్రంలో చట్టబద్ధపాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.













