సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం…ఆయనను ఎప్పటికి మర్చిపోలేను
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ వరుసగా వేర్వేరు రాష్ట్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. తమిళనాడు లోని సేలం జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పదేళ్ల క్రితం సేలం జిల్లాలో హత్యకు గురైన బీజేపీ నాయకుడు వి.రమేశ్‌ను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో కొద్దిసేపు తన ప్రసంగాన్ని నిలిపి తిరిగి ప్రారంభించారు. ఆడిటర్ రమేశ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతం ఆయన మనతో లేరు. ఆయనో గొప్ప వ్యక్త. రాత్రింబవళ్లు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. కానీ ఆయన హత్యకు గురయ్యారు. సభాముఖంగా నేను ఆయనకు నివాళి అర్పిస్తున్నా అని మోదీ అన్నారు.













