వాళ్లు ఎన్నిక కుట్రలు పన్నినా.. తన ఇమేజ్ డామేజ్ కాదు
బీజెపీ ఎన్ని ఎత్తులు వేసినా తనకు వచ్చిన నష్టమేమీ లేదని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు వాళ్లు (బీజేపీ ఆగ్ర నాయకులు) కుట్ర పన్నారని ఆరోపించారు. వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా తన ఇమేజ్ను డామేజ్ చేయడం గానీ, రాజకీయ శక్తిని తగ్గిచడం గానీ వాళ్ల వల్ల కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వైఖరిని ప్రజలు పసిగడుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఆ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా జార్ఖండ్లో తమ పార్టీ బలం తగ్గదన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో తమకు 52 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో ఆ సంఖ్యాబలం 75కు చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.













