నవంబర్ లో రతన్ టాటా బయోగ్రఫీ
భారతీయ పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బయోగ్రఫీ ఈ ఏడాది నవంబర్లో విడుదల కానుంది. మాజీ ఐఏఎస్ అధికారి థామస్ మాథ్యూ రాయనున్నారు. రతన్ ఎన్.టాటా ది అథరైజుడ్ బయోగ్రఫీ పేరిట తీసుకురానున్నారు. బయోగ్రఫీ ప్రచురణ హక్కులు దక్కించకున్నట్టు హృార్పర్ కొల్లిన్స్ పబ్లిషర్స్ ప్రకటించింది. ప్రపచంలో అత్యంత ప్రభావశీల ప్రేరణాత్మక వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరని హార్పర్ కొల్సిన్స్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫార్మాట్లలోనూ బయోగ్రఫీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.













