జర్మనీలో భారత రాయబారిగా హరీశ్ పర్వతనేని
సీనియర్ దౌత్యాధికారి హరీశ్ పర్వతనేని జర్మనీలో భారత రాయబారిగా నియమితులయ్యాయరు. హరీశ్ హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి బంగారు పతకం సాధించారు. తర్వాత కలకత్తాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో చదువుకున్నారు. సివిల్స్ కు ఎంపికై శిక్షణానంతరం వివిధ దేశాల్లో పనిచేశారు. కైరోలోని అమెరికా విశ్వవిద్యాలయంలో అరబిక్ భాషను నేర్చుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. 1990 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ కు చెందిన అధికారిగా ఆయన ప్రస్తుతం ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యాలయంలో సేవలందిస్తున్నారు. త్వరలోనే జర్మనీలో బాధ్యతలు చేపట్టనున్నారని ఈ శాఖ ప్రకటించింది.













