కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ
ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఖేద్బ్రహ్మ నియోజకవర్గం ఎమ్మెల్యే అశ్విన్ కొత్వాల్ తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ నీమాబేన్ ఆచార్యకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. ఇప్పటికే మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఖేద్బ్రహ్మ నియోజకవర్గ ప్రజలకు సేవలందించాను. తన నియోజకవర్గంలో ఉన్న గిరిజనులు బాగుపడాలంటే తాను బీజేపీలో చేరక తప్పడం లేదు. తన నియోజకవర్గంలో ఉన్న గిరిజనులు అభివృద్ధి కోసతే తాను కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. బీజేపీ వల్లే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని తాను నమ్ముతున్నాని అన్నారు.













