శ్రీమతి శోభారాజు, నాటా ఆధ్వర్యంలో ప్రపంచ ప్రార్థన

గోవిందా రక్షమాం కరోనాతః
అన్నమాచార్య భావన వాహిని, ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా శోభా రాజు రచించి, సంగీతం సమకూర్చిన గోవిందా రక్షమాం కరోనాతః ప్రార్థన వీడియోను విడుదల చేశారు.
ఒకరు ప్రార్థించడం కన్నా సమిష్టిగా మనమంతా కలిసి ప్రార్థించినపుడు ఆ ప్రార్థనకు బలమెక్కవ. కరోనా ఏ ఒక్కరినో, ఏ ఒక్క దేశాన్నో బాధించడం లేదు. యావత్ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. ప్రపంచంలోని మనుషులందరూ కలిసి చేసిన సమిష్టి కర్మ ఫలం ఈ కరోనా.ఈ భయంకర పరిస్థితిని సమిష్టి ప్రార్థనతోనే అధిగమించిగలం. మనమంతా కలసి ముక్త కంఠంతో, ఒకే భావంతో, ‘‘గోవిందా రక్షమాం కరోనాతః’’ అంటూ పద్మశ్రీ అవార్డు గ్రహీత డా శోభా రాజు గారు రచించి, సంగీతం సమకూర్చిన ఈ ప్రార్థనా గీతాన్ని భక్తితో పాడుదాం. భగవంతుడి అనుగ్రహంతో ఈ భయంకర కరోనా నుండి విముక్తి పొందుదామని అన్నమాచార్య భావనావాహిని పిలుపునిస్తోంది. అందరూ ఈ ప్రార్థనను పాడాలని కోరుతోంది.