చైనాకు భారత్ మరో షాక్
చైనా కంపెనీలకు భారత్ మరో షాకిచ్చింది. దేశంలోకి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్న బొమ్మలు, ఉక్కు కడ్డీలు, పైపులు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికం ఉత్పత్తులు, భారీ యంత్ర సామాగ్రి, పేపర్, రబ్బర్ వస్తువులు, గ్లాస్ తదితర సుమారు 371 వస్తూత్పత్తుల నాణ్యతను తప్పనిసరి భారతీయ ప్రమాణాల కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ చైనా నుంచే భారత్కు ఎక్కువగా వస్తుండటం గమనార్హం. వచ్చే ఏడాది మార్చి నుంచి నూతన ఇండియన్ స్టాండర్స్ (ఐఎస్) విధానంలో అమల్లోకి రానున్నది. ఇందులో కఠినమైన దిగుమతి నిబంధనలు పెట్టనున్నారు. ఈ క్రమంలోనే కండ్ల, జేఎన్పీటీ, కొచ్చిన్ వంటి ప్రధాన ప్రభుత్వ పోర్టులతో పాటు దేశంలోని అన్ని సరిహద్దుల వద్ద ప్రమాణాలను పరిశీలించేందుకు తమ అధికారులను మోహరిస్తున్నట్లు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తకర పరిస్థితుల మధ్య ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు ప్రభావితమవుతున్నాయి.













