జీ20 సదస్సు నిర్వహణపై ప్రపంచ నేతల హర్షం
జీ20 శిఖరాగ్ర సదస్సును దిగ్విజయంగా నిర్వహించడంపై మనదేశంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సదస్సుకు అత్యద్భుతంగా ఆతిథ్యమిచ్చారని, ఢిల్లీ సమావేశాలు పలు సమస్యలకు పరిష్కార హామీని ఇచ్చాయని ప్రపంచనేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థతను శ్లాఘించారు. సదస్సును విజయవంతం చేసినందుకు ఆయన నిర్ణయాత్మక నాయకత్వాన్ని కొనియాడారు. దక్షిణ ప్రపంచం స్వరానికి ప్రతినిధిగా నిలిచారంటూ కితాబునిచ్చారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అన్న భారత్ సందేశం ప్రతినిధులందరి మధ్య బలంగా ప్రతిధ్వనించిందని పేర్కొన్నారు.













