భారత్-అమెరికా భాగస్వామ్యానికి ఇదే నిదర్శనం …
ప్రపంచ ప్రయోజనాల కోసం ఎలాంటి సవాలునైనా ఎదుర్కునే సామర్థ్యం భారత్, అమెరికా దేశాలకు ఉందని అమెరికా సీనియర్ దౌత్యధికారి ఒకరు పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోనూ, ప్రపంచంలోనూ భారత్, అమెరికాల మధ్య భాగస్వామ్యానికి కొవిడ్ 19 మహమ్మారిపై ఇరు దేశాలు చేస్తున్న పోరాటమే నిదర్శనమని అన్నారు. కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పుడు వైరస్ గురించి వాస్తవ సమాచారం తెలియక ప్రపంచ దేశాలు నిరాశగా చూస్తున్న వేళ.. పీపీఈ కిట్లు, ఇతర వైద్య సరఫరాల కోసం వెతుక్కుంటున్న వేళ అమెరికాకి భారత్ కీలక భాగస్వామిగా నిలిచిందని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.













