జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ
అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే క్రమంలో కీలక ముందడుగు పడింది. కోర్టు చరిత్రలో తొలిసారి ప్రొసీడిరగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీజేఐ ధర్మాసనం విచారణ ప్రత్యక్ష ప్రసారానికి జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఈ రోజు ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ సందర్భంగా అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆయన ఆకాక్షించారు. జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా న్యాయవాదులు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని కొనియాడారు.
జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పని చేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.













