బంగ్లాను చిత్తు చేసిన ఇంగ్లండ్
వన్డే వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ భారీ విజయం నమోదు చేసింది. ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండో 364 పరుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ మలాన్ (140), జో రూట్ (82), జానీ బెయిర్‌స్టో (52) అదరగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తడబడింది. ఆ టీంలో లిటాన్ దాస్ (76), ముష్ఫికర్ రహీం (51), తౌహీద్ హృదోయ్ (39) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లు ఎవరూ ఆకట్టుకోలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే నాలుగు వికెట్లతో చెలరేగాడు. క్రిస్ వోక్స్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. మిగతా బౌలర్లు తలా ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో బంగ్లా జట్టు 48.2 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ఏకంగా 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ శతకంతో చెలరేగిన డేవిడ్ మలాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













