జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. 18 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వాస్తవానికి మార్చిలోనే ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కొవిడ్ 19 కారణంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆంధప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైకాపా నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. గుజరాత్ 4, మధప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మూడేసి, ఝార్ఖండ్ 2, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ఒక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 55 ఖాళీల్లో ఇప్పటికే 37 స్థానాలు ఏకగ్రీవం కాగా ..18 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.













