శరద్ పవార్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్…. ఎన్సీపీ జాతీయ హోదాను
శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ హోదా ప్రమాదంలో పడింది. జాతీయ హోదాపై ఎన్నికల సంఘం త్వరలో సమీక్షించనున్నది. మహారాష్ట్ర మహా వికాస్ అగాది కూటమిలో ఎన్సీపీ కొనసాగుతున్నది. ఎన్సీపీకి ఉన్న జాతీయ పార్టీ హోదాను పున పరిశీలస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించిది. ఈ నేపథ్యంలో జాతీయ హోదా రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ అంశంపై ఎన్సీపీ నుంచి ప్రతినిధి వివరణ కోరింది ఈసీ. ఒకవేళ ఎన్సీపీ ప్రతినిధి ఇచ్చిన వివరణను ఈసీ అంగీకరించని పక్షంలో పవర్ పార్టీకి షాక్ తగలనుంది.
జాతీయ పార్టీ హోదాను కోల్పోతుంది ఎన్సీపీ. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే లోక్సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లు వచ్చి ఉండాలి. నాలుగు ఎంపీ సీట్లను సైతం గెలవాలి. దాంతో పాటు మరో అవకాశం సైతం ఉంది. అది ఎంటంటే దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాలు గెలిచి ఉండాలి. ఈ రెండుశాతం సీట్లు కూడా మూడు రాష్ట్రాల నుంచి గెలవాలి. ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న జాతీయ పార్టీగా గుర్తిసాత్రు. ఈ క్రమంలో ఎన్సీపీ 2019లో జాతీయ హోదా లభించింది.













