కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. పోలింగ్ వెహికిల్స్ కు జీపీఎస్
లోక్‌సభ ఎన్నికల సమయంలో పశ్చిమబెంగాల్లో జరిగే అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్లో పోలింగ్ కోసం వాడే అన్ని వాహనాలకు జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఓ ఎన్నికల అధికారి వెల్లడిరచారు. ఈ మేరకు సిబ్బంది అవసరమైన సూచనలు చేసినట్లు తెలిపారు. ఈవీఎంలు సహా ఇతర ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించినప్పటి నుంచి పోలింగ్ అనంతరం ఆ ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తీసుకొచ్చే వరకు పర్యవేక్షించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించనున్నాం. తద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తాం అని ఎన్నికల చెప్పారు. ఒకవేళ ఏమైనా అవకతవకలను గుర్తిస్తే తమ సిబ్బంది వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.













