తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ కేంద్రానికి ప్రతి పాదించారు. ఈ సిఫారసుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ప్రక్రియ అనంతరం.. నవంబర్ 9న జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు 50వ సీజేగా బాధ్యతలు చేపడుతారు. సరిగ్గా రెండేళ్ల పదవీ కాలంతో ఆయన 2024 నవంబర్ 10 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. వారసుడిని సిఫారసు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ నెల 7న సీజేఐ జస్టిస్ లలిత్‌కు లేఖ రాశారు. సీజేఐగా జస్టిస్ లలిత్ పదవీ కాలం నవంబర్ 8తో ముగియనున్నది.













