ప్రధాని మోదీ భద్రతలో మరోసారి వైఫల్యం!
ప్రధాని మోదీ భద్రతలో మరోసారి వైఫల్యం చోటు చేసుకుంది. ఆయన నివాసం వద్ద ఓ డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఓ అనుమానాస్పద డ్రోన్ ప్రధాని నివాసంపై సంచరించినట్లు ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) నుంచి సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు వెల్లడిరచారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని మోదీ అధికారిక నివాసం ఉంది. సాధారణంగా ప్రధాని నివాసం వద్ద నో ఫ్లై జోన్ అమల్లో ఉంటుంది. అలాంటి ప్రాంతంలోకి డ్రోన్ రావడంతో భద్రత సిబ్బంది వెంటనే ఆప్రమత్తమయ్యారు. దీంతో ఢిల్లీ పోలీసులు, భద్రత సిబ్బంది రంగంలోకి దిగి డ్రోన్‌ను ట్రాక్చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అయితే ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఏదీ కన్పించలేదని తెలుస్తోంది. ప్రధాని నివాసం పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి డ్రోన్ తరహభా వస్తువు కన్పించలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) రూంను కూడా సంప్రదించాం. ప్రధాని నివాసం వద్ద ఎలాంటి ఎగిరే వస్తువును గుర్తించలేదని వారు చెప్పారు అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.













