అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ కు షాక్
ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయను సరిత విహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 2019 నాటికి ఓ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జాతీయ మహిళా కమిషన్ గోపాల్‌కు సమన్లు పంపింది. అయితే తనను అరెస్టు చేసిన అనంతరం గోపాల్ స్పందించారు. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మ తనను జైల్లో పెడతానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం పటేల్ సామాజిక వర్గాన్ని జైలుకు పంపడం తప్ప ఇంకేం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీకి పాటీదార్లంటే ద్వేషమని ఆరోపించారు. తాను సర్దార్ పటేల్ వంశానికే చెందిన వాడినని, జైలు అంటే భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.













