ఎమ్మెల్సీ కవితకు షాక్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీని కూడా రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్ట కింద కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 15న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.