ఆప్‌ను అధికారంలోకి తీసుకొస్తే.. ఢిల్లీ తరహాలో
ఆప్‌ను అధికారంలోకి తీసుకొస్తే ఢిల్లీ తరహాలో నాణ్యమైన పాలనను అందిస్తామని గుజరాత్ ఓటర్లకు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత, నాణ్యమైన విద్యనందిస్తామన్నారు. మంచి విద్యాప్రమాణాలతో పేదరికాన్ని నిర్మూలించొచ్చని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులకు మరింతగా మెరుగుపరచడంతో పాటు కొత్త పాఠశాలలను సైతం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే గుజరాత్‌లోని ప్రైవేటు పాఠశాలలో ఆడిట్ నిర్వహిస్తామని, డిళ్లీలో చేసినట్టుగానే తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బుల్ని తిరిగి ఇప్పిస్తామన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించనున్నట్లు కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.













