కేజ్రీవాల్ సంచలన ప్రకటన.. నెక్ట్స్ కర్నాటకే
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో కేజ్రీవాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే వుంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆఫ్ ప్రభుత్వాన్ని నెలకోల్పుతామని సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రైతులను చెలగాటాలొద్దని తాము బీజేపీని పదే పదే హెచ్చరించినా, పెద చెవిన పెట్టిందని, చివరికి సాగు చట్టాను వెనక్కి తీసుకుందని ఎద్దేవా చేశృారు. రైతులు చేసిన పోరాటానికి తాను సలామ్ చేస్తున్నానని ప్రకటించారు. తమది దేశభక్తుల పార్టీ అని చెప్పుకొచ్చారు.













