భారత్ కీలక నిర్ణయం.. వచ్చే నెల నుంచి విదేశాలకు
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన భారత్, విదేశాలకు టీకాలు ఎగుమతిపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశ అవసరాలకు సరిపోగా మిగిలే టీకా డోసులను అక్టోబరు, డిసెంబర్ త్రైమాసికం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. వ్యాక్సిన్ మైత్రి పేరిట నిర్వహించనున్న ఎగుమతుల డ్రైవ్లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కోవ్యాక్స్ క్యాక్రమానికి, పొరుగుదేశాలకు టీకా అందిస్తామని పేర్కోన్నారు. బయోలజికల్`ఈతో పాటు పలు కంపెనీల టీకాలకు అనుమతులు మంజూరైన నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లో మొత్తం 100 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.













