అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని పొడగించిన సర్కార్
కరోనా నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని వచ్చే నెల 28 వరకూ పొడగిస్తున్నట్లు కీలకమైన ప్రకటన చేసింది. అయితే తమ నుంచి ముందుగానే అనుమతి పొందిన అంతర్జాతీయ కార్గో, ప్రత్యేక విమానాలకు మాత్రం మినహాయింపు ఉంటుందని, వాటికి ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 23 నుంచే భారత ప్రభుత్వం అంతర్జాతీయ సర్వీసులపై నిషేధాన్ని విధించింది. అయితే కేస్ టు కేస్ విధానంలో మాత్రం అనుమతించిన కొన్ని రూట్లలో మాత్రమే ప్రస్తుతం విమానాలు తిరుగుతున్నాయి.













