సోనియాజీ నాకు ఆ అర్హత లేదా ?
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖారారు చేసింది. రాజ్యసభ బెర్తులు దక్కకపోవడంపై పలువురు సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ నిరసన, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీనియర్ నేత, మాజీ నటీ నగ్మ సైతం తనకు రాజ్యసభ అవకాశం దక్కకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను తప్పకుండా పెద్దల సభకు పంపుతానని 2003-04 సమయంలో సోనియా గాంధీ మాటిచ్చారని, 18 ఏళ్లు గడిచినా తనకు అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ భాయ్ వంటి వారికి మహారాష్ట్ర నుంచి అవకాశం కల్పించారని పేర్కొన్నారు. బహుశా తనకు తక్కువ అర్హతలు ఉన్నయోమోనని వ్యాఖ్యానించారు.













