విమాన ప్రయాణికులకు .. ఇకమీదట ఒకే హ్యాండ్‌బ్యాగ్
విమాన ప్రయాణికులకు ఇకమీదట కేవలం ఒకే హ్యాండ్‌బ్యాగ్‌ను అనుమతించాలని సీఐఎస్ఎఫ్ నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో ప్రయాణికుడు సగటున 2-3 హ్యాండ్‌బ్యాగ్‌లు తెస్తున్నందున వాటి తనికీకి సమయం తీసుకోవడంతో పాటు, తనికీ కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడుతోందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్‌కు సీఐఎస్ఎస్ లేఖ రాసింది. ప్రయాణికులు స్క్రీనింగ్ పాయింట్ వద్దకు సగటున 2-3 బ్యాగులతో వస్తున్నారు. ఇది తనిఖీల సమయాన్ని రద్దీని పెంచి అందరికీ అసౌకర్యంగా మారుతోంది. ఇకపై అన్ని ఎయిర్‌లైన్స్, ఎయిర్‌లైన్ నిర్వాహకులు ఒకే హ్యాండ్ బ్యాగ్ నిబంధన అమలుకు చర్యలు తీసుకోవాలి అని సీఐఎస్ఎఫ్ లేఖలో పేర్కొంది.













