కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం… ఇకపై పార్లమెంట్ కు
ఇటీవల లోక్సభ లోకి దుండగులు ప్రవేశించి రంగుల పొగతో సృష్టించిన అలజడితో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనతో పార్లమెంట్ భద్రత పై అనేక సందేహాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై పార్లమెంట్ భవన సముదాయంలో సమగ్ర భద్రత బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు అప్పగించాలని కేంద్ర నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. పార్లమెంట్ భవన సముదాయంలో సర్వే చేపట్టాలని కేంద్ర హోంశాఖ ఆదేశించినట్లు సదరు వర్గాలు తెలిపారు. ఈ సర్వే అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించనున్నట్లు తెలుస్తోంది. సీఐఎస్ఎఫ్కు చెందిన గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీ యూనిట్ నిపుణులు, ఫైర్ యూనిట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్ భద్రతా బృందాలతో కలిసి ఈ వారంతంలో సర్వే చేపట్టనున్నారు.













