చైనాలో మరో ప్రమాదకర వ్యాధి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మరో ప్రమాదకర వ్యాధి విజృంభిస్తోంది. వాయువ్య రాష్ట్రమైన గన్సూలోని ల్యాన్ఝౌ నగరంలో బ్రూసెల్లోసిస్ అనే జబ్బు క్రమంగా విస్తరిస్తున్నట్టు అక్కడి నేషనల్ హెల్ కమిషన్ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన 3,245 మంది పడ్డట్టు ప్రకటించింది. బ్రూసెల్లా అనే బ్యాక్టిరియా వల్ల ఈ వ్యాధి వస్తోంది. దీన్ని మల్టా ఫీవర్ అని పిలుస్తారు. ఇది సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కీళ్ల-కండరాల నొప్పి, వెన్ను నొప్పి, చలి, చెమటలు పట్టడం, ఆయాసం, బరువు తగ్గడం, ఆకలిగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇది జంతువుల నుంచి వ్యాపిస్తుంది. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు, అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఇది మనుషులకు సోకుతుంది.













