దేశ అత్యున్నత పదవుల్లో.. ఇద్దరు తెలుగువాళ్లు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటో వైరల్ అవుతోంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఒకరికొకరు ప్రమాణ స్వీకారం అనంతరం చీఫ్ జస్టిస్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కరించారు. మర్యాద పూర్వకంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతి నమస్కారం చేశారు. ఇప్పుడీ ఫొటోను తెలుగు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇద్దరు తెలుగువాళ్లు దేశ అత్యున్నత పదవుల్లో ఉండటం సాటి తెలుగువారికి గర్వకారణం అంటూ ట్వీట్ చేస్తున్నారు.













