ప్రవాస భారతీయులకు ఎన్ఆర్ఐ ఓటర్లుగా రిజిస్ట్రేషన్
విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరూ తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ముందు ఎన్ఆర్ఐ ఓటర్లుగా రిజిస్టర్టు చేసుకోవాలని భారత ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర విజ్ఞప్తిచేశారు. వారు నివసిస్తున్న దేశంలో పౌరసత్వం రానంతవరకూ వారు భారత్‌లో ఎన్ఆర్ఐలుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 1.12 లక్షల మంది రిజిష్టరు అయిన విదేశీ ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్ఆర్ఐల కోసం పోస్టల్ బ్యాలెట్లను కూడా ప్రతిపాదించామని ఆయన అన్నారు. దక్షిణాఫ్రికా, మారిసన్ దేశాల్లో ఎన్నికల కమిషన్ పర్యటించింది. ఈ నెల 9 నుంచి 19 వరకు ఆ దేశాల్లో పర్యటించిన సుశీల్‌చంద్ర ప్రతినిధి బృందం అక్కడి ఎన్ఆర్ఐ గ్రూపులతో చర్చలు జరిపింది. కొన్ని విదేశీ భారతీయుల సంఘాలతో సమావేశాలు కూడా నిర్వహించింది. ప్రవాస భారతీయులు ముందు విదేశీ ఓటర్లుగా రిజిసర్టు చసుకోవాలని సీఈసీ వారికి సూచించారు.













