ఈ నెల 8 నుంచి చార్ధామ్ యాత్ర
ఈ నెల 8 నుంచి చార్ధామ్ యాత్రను ప్రారంభించనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. కరోనా నేపథ్యంలో తొలుత పరిమిత సంఖ్యలోనే భక్తుల సందర్శనకు అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి మదన్ కౌశిక్ చెప్పారు. అనంతర దశలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి.. ఆయా రాష్ట్రాలకు చెందిన భక్తులను అమనుతించడం, బస్సులను నడిపే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. హిమాలయాల్లో కొలువైన నాలుగు పవిత్ర క్షేత్రాలు బదిరీనాథ్, కేదార్నాథ్ గంగోత్రి, యమునోత్రిని చార్‌ధామ్‌గా వ్యవహరిస్తారు. నెలన్నర కిందటే ఈ ఆలయాలను తెరిచినప్పటికీ లాక్డౌన్ వల్ల భక్తుల సందర్శనను నిలిపివేశారు.













