కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం.. సివిల్ సర్వీసెస్ చరిత్రలో మొదటిసారి

తన పేరు జెండర్ మార్చాలంటూ ఓ ఐఆర్‌ఎస్ ఆఫీసర్ చేసుకున్న అప్పీల్‌పై కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ సివిల్ సర్వీసెస్ చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ఐఆర్‌ఎస్ అధికారిణి పేరు, జెండర్‌ను అధికారికంగా మార్చటానికి ఆమోదం తెలిపింది. తన పేరును ఎం అనుకతిర్ సూర్యగా, తనను పురుషుడిగా గుర్తించాలని ఐఆర్‌ఎస్ ఆఫీసర్ ఎం అనుసూయ చేసుకున్న అభ్యర్థనను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సదరు ఐఆర్‌ఎస్ ఆఫీసర్ హైదరాబాద్ సీఈఎస్‌టీఏటీ జాయింట్ కమిషనర్‌గా ఉన్నారు. కేంద్ర నిర్ణయం ప్రగతి శీలమైందిగా ఐఆర్‌ఎస్ ఆఫీసర్ పేర్కొన్నారు. దేశంలో లింగ వైవిద్యం పట్ల సానుకూలతను తీసుకొస్తుందని అన్నారు.