సుప్రీంకోర్టు జడ్జిలుగా మరో ఇద్దరు
సుప్రీంకోర్టులో మరో ఇద్దరు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, కోర్టులో జడ్జిల సంఖ్య 34కు పెరిగింది. సుప్రీంకోర్టు జడ్జిల గరిష్ఠ సంఖ్య కూడా 34. కొత్తగా నియమితులైన ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్ రెండు రోజుల్లో సుప్రీం జడ్జిలుగా ప్రమాణం చేయనున్నారు. వీరి ప్రమాణ స్వీకారం తర్వాత సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. జస్టిస్ రాజేశ్ బిందాల్ ఇప్పటి వరకు అలహాబాద్ హైకోర్టు సీజేగా, జస్టిస్ అరవింద్ కుమార్ గుజరాత్ హైకోర్టు సీజేగా పని చేశారు. వీరిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించాలంటూ కొలీజియం జవనరి 31న కేంద్రానికి సిఫారసు చేసింది. వారం క్రితమే కేంద్ర ప్రభుత్వం ఐదుగురిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.













