1947 తర్వాత తొలిసారి.. బడ్జెట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండు విడతలుగా జరగనున్నాయి. అయితే ఈసారి బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 1947 తర్వాత తొలిసారి బడ్జెట్ ప్రతులను ముద్రించకూడదని నిర్ణయించింది. దీనికి ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఆమోదం లభించింది. కరోనా నేపథ్యంలో 100 మందికి పైగా వ్యక్తులను 15 రోజుల పాటు ప్రింటింగ్ ప్రెస్లో ఉంచలేమని ఆర్థికశాఖ చెప్పడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో బడ్జెట్ సాఫ్ట్ కాపీలను సభ్యులందరికీ అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం వెల్లడించింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశప్టెనున్నారు.













