ఖుష్బూకు ఈసారి బీజేపీ అవకాశం..
గతంలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డ సినీ నటి ఖుష్భూకు ఈసారి బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇటీవల బీజేపీలోకి చేరిన ఆమె చేపాక్కం-ట్రిప్లికేస్ నుంచి పోటీ చేయాలని భావించినా పొత్తులో భాగంగా ఆ స్థానం అన్నాడీఎంకేకు వెళ్లింది. దీంతో ఆ నియోజకవర్గానికి పక్కనే ఉన్న థౌజండ్ లైట్స్ సీటును బీజేపీ ఖుష్బూకు ఖరారు చేసింది. అలాగే ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఎల్మురుగన్ తారాపురంలో, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ సినీ నటుడు కమల్ హాసన్ బరిలో ఉన్న కోయంబత్తూరు దక్షిణ నియోజవకర్గం నుంచి పోటీ చేయనున్నారు.













