ప్రధానమంత్రి వెళితే ఆ ముగ్గురిలో.. ఒక్కరూ వెళ్లలేదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నాయకత్వం, ఆ రాష్ట్ర సీఎం కలిసి కుట్ర పన్నారని బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని భద్రతపై ప్రతిపక్ష పార్టీ నిర్లక్ష్యంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ రాష్ట్ర సీఎం, సీఎస్, డీజీపీ వెళ్లి స్వాగతం పలకాల్సి ఉందని గుర్తు చేశారు. కానీ, ప్రధానమంత్రి వెళితే ఆ ముగ్గురిలో ఒక్కరు వెళ్లలేదని అభ్యంతరం వ్యక్తం చేశృారు. ప్రధాని భద్రతకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ గురించి మాట్లాడుతుందని విమర్శించారు. పంజాబ్ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రధాని భద్రత, దేశ సరిహద్దు విషయంలో బీజేపీ ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదన్నారు.







