నెలకు రూ.2 వేల పొదుపుతో మొదలై.. కోటీశ్వరుడిగా మారిన ఒక టీచర్ సక్సెస్ స్టోరీ!
ఆర్థికంగా స్థిరపడటానికి భారీ జీతం అవసరం లేదు, పక్కా ప్లానింగ్, క్రమశిక్షణ ఉంటే చాలని ఒక సామాన్య స్కూల్ టీచర్ నిరూపించారు. కేవలం రూ.20,000 నెల జీతంతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, విలాసాలకు దూరంగా ఉంటూ, కేవలం పొదుపుపైనే ఫోకస్ పెట్టారు. చిన్న మొత్తాలతో పొదుపు చేస్తూ కాలాన్ని పెట్టుబడిగా మార్చుకుని, మధ్యతరగతి ఉద్యోగులకు ఒక చక్కని రోడ్ మ్యాప్‌లా నిలిచారు.
తొలి ఎస్ఐపీ (SIP) పెట్టుబడితో ప్రారంభం..
నెలకు కేవలం రూ.2,000 పొదుపు చేస్తూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఆయన తన ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేశారు. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల మధ్యమధ్యలో నష్టాలు కనిపిస్తున్నా భయపడకుండా తన ప్లాన్‌ను లాంగ్ టర్మ్ కొనసాగించారు. ఈ పట్టుదలే ఆయన చేసిన చిన్న చిన్న పొదుపు మొత్తాలను కాలక్రమేణా భారీ సంపదగా మార్చింది.
అంచనా వేసిన నిధి..
ఈ టీచర్ తన ప్రయాణంలో కాలక్రమేణా పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లిన తీరు అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. మొదటి 5 ఏళ్లలో నెలకు రూ. 5,000 చొప్పున పెట్టుబడి పెట్టడం ద్వారా దాదాపు రూ. 4.10 లక్షల నిధి సమకూరింది. ఆ తర్వాత 10 సంవత్సరాలకు నెలవారీ ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ. 10,000కు పెంచడంతో ఆ మొత్తం రూ. 23.23 లక్షలకు చేరింది. ఇక 15 ఏళ్ల మార్కు వచ్చేసరికి నెలవారీ పొదుపును రూ. 15,000కు పెంచడంతో ఫండ్ వాల్యూ రూ. 75.45 లక్షలకు చేరుకోగా, చివరగా 20 సంవత్సరాల నాటికి నెలకు రూ. 20,000 చొప్పున ఇన్వెస్ట్ చేయడంతో కాంపౌండింగ్ పవర్ (చక్రవడ్డీ) తోడవడంతో ఆ నిధి ఏకంగా రూ. 1.50 కోట్ల భారీ సంపదగా మారిపోయింది.
నో పర్సనల్ లోన్స్..
ఎక్కువ వడ్డీలు కట్టాల్సి వచ్చే పర్సనల్ లోన్లకు దూరంగా ఉండటం, అప్పులు చేసి ఆడంబరాలకు పోకపోవడమే ఆయన ఆర్థిక విజయానికి ప్రధాన కారణం. దీనికి తోడు ప్రతి సంవత్సరం తన ఎస్ఐపీ (SIP) మొత్తాన్ని కనీసం 10 శాతం పెంచుకుంటూ వెళ్లారు. ఈ స్టెప్-అప్ పద్ధతి వల్ల పెరుగుతున్న ధరలను తట్టుకుని, అనుకున్న కోటి రూపాయల లక్ష్యాన్ని సులువుగా సాధించగలిగారు.
మధ్యతరగతి వాళ్లకు చక్కని పాఠం..
సాధారణ ఉద్యోగి అయినా సరే.. క్రమశిక్షణతో ఉంటూ, అనవసరపు అప్పుల ట్రాప్‌లలో పడకుండా ఉంటే ఎవరైనా కోటీశ్వరులు కావచ్చని ఈ సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది. చిన్న మొత్తంతోనైనా సరే, వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి, సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని చెప్పడానికి ఈ స్కూల్ టీచర్ కథే ఒక బెస్ట్ ఉదాహరణ.







