కేటీఆర్ కు ఆటా ఆహ్వానం
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా ) బృందం కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో
అమెరికా మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించింది. ఆటా సభల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను కేటీఆర్ కు వివరించారు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల.
ఈ సందర్భంగా అమెరికాలోని భారతీయుల పరిస్థితులు, రాజకీయాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో NRI ల పాత్ర, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ కార్యక్రమాల పై కేటిఆర్ చర్చించారు. TDF అప్పటి చైర్మన్ మధు రెడ్డి నల్లగొండ ఫ్లోరైడ్ పోరాటంలో మద్దతు ఇచ్చిన విషయం కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో NRI లు ప్రజలకు అమెరికాలో ఉండి కూడా ఎలా మద్దతు కూడ గట్టారో వివరించారు. శరత్ వేములతో రెండు దశాబ్దాలుగా తనకు ఉన్న ఉద్యమ సంబంధాన్ని జ్ఞప్తి చేసుకున్నారు కేటీఆర్. పదేళ్ల BRS పాలనలో రాష్ట్రం దేశానికి తలమానికంగా నిలిచింది అని చెప్పారు.
కేటీఆర్ ను కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా పాల్గొన్నారు. ఆటా మహా సభలకు హాజరయ్యేందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.







