ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన తాము సిద్ధమే
సార్వత్రిక ఎన్నికలు ముందుగానే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ఇండియా కూటమి ఎప్పుడైనా సిద్ధంగా ఉందన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందుగానే నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం యోచిస్తోందని, ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పానని అన్నారు. ఇండియా కూటమి ఐకమత్యంగా ఉందని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇండియా కూటమి ఐక్యమత్యంగా పోరాడుతుంది. ప్రజల కోసమే మా కూటమి ఉంది. ఎప్పటికీ వారికి సేవ చేస్తూనే ఉంటుంది. మేమంతా కలిసి బిహార్లో రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, వంతెనలు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం అని అన్నారు.













