ఆ వార్తల్లో నిజం లేదు… ఆయన క్షేమంగా ఉన్నారు
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారత రత్న అమర్త్యసేన్ క్షేమంగానే ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. అమర్త్యసేన్ మరణించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన కుమార్తె నందనా సేన్ ఖండించారు. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. అమర్త్యసేన్ మరణించినట్లు వార్తలు రావడంతో ఆందోళన వ్యక్తం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతుమన్నారు. తన తండ్రి మరణించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని నందన పేర్కొన్నారు. ఆయన క్షేమంగా ఉన్నారని, తామంతా కేంబ్రిడ్జిలో గత రాత్రి ఆనందంగా గడిపామని వెల్లడిరచారు. హార్వర్డ్ యూనివర్సిటీలో తన తండ్రి రెండు కోర్సులు బోధిస్తున్నారని, అలాగే ఓ పుస్తకం రాసే పనిలో నిమగ్నమై ఉన్నారని ఆమె తెలిపారు. అమర్త్యసేన్ మృతి చెందినట్టు వచ్చిన వదంతులతో పలువరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన పూర్తిగా క్షేమంగానే ఉన్నట్టు అమర్త్యసేన్ కుమార్తె సృష్టత ఇవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. .













