కేంద్ర మంత్రులకు మోదీ సూచన.. ప్రస్తుతానికి మీరు అక్కడికి వెళ్లొదు
అయోధ్యలో నూతనంగా ప్రతిష్ఠించిన బాలరాముడి ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తడంతో రద్దీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కేబినెట్ మంత్రులకు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. రద్దీ దృష్ట్యా ప్రస్తుతానికి అయోద్య దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయ. అయోధ్యలో రద్దీ ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీఐపీ ప్రోటోకాల్స్ వారికి అసౌకర్యం కలిగిస్తాయి. అందువల్ల కేంద్రమంత్రులు మార్చిలో బాలరాముడిని దర్శించుకుంటే మంచిదని భావిస్తున్నా. ప్రస్తుతానికి మీరు అక్కడికి వెళ్లొదు అని కేబినెట్ సమావేశంలో మోదీ సూచించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నారు..













