మసీదు నిర్మాణానికి ముందే … అక్కడ హిందూ దేవాలయం!
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు నిర్మాణానికి ముందు అక్కడ హిందూ దేవాలయం ఉండేదని పురావస్తు శాఖ సర్వేలో తేలిన విషయం తెలిసిందే. అయితే ఆ సర్వే ఆషామాషీగా సాగలేదు. అత్యున్నత సాంకేతికతతో, సాధికారికంగా నిర్వహించిన ఆధారాలు సేకరించారు. మసీదు ఉన్న ప్రాంతంలో భూమి లోపల ఆలయ నమునాలు, పాక్షికంగా ధ్వంసమైన ఆనాటి దేవతల విగ్రహాలు, శిలాశాసనాలు లభ్యమైనాయి. పర్షియన్ సంస్కృతం, తెలుగు, కన్నడ, దేవనాగరి లిపిలో శాసనాలు కూడా దొరికాయి. శివలింగం లేని పానిపట్టం, బాగా దెబ్బతిన్న గణేశ, హనుమ, నంది విగ్రహాలు లభ్యమైనాయి. హనుమ విగ్రహానికి ఎడమచేయి ధ్వంసమైంది. ఈ నివేదిక మొత్తం 839 పేజీలుంది.













